Home ఎడ్యుకేషన్ ఇస్రో సైంటిస్టుగా పూర్వ కరీంనగర్ జిల్లా యువకుడు

ఇస్రో సైంటిస్టుగా పూర్వ కరీంనగర్ జిల్లా యువకుడు

31
0

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 9:

పూర్వ కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో సైంటిస్టుగా ఎంపికై జిల్లా గర్వకారణంగా నిలిచారు.
గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రాజశేఖర్, ఉమారాణిల కుమారుడైన రాజసింహ జగిత్యాలలో 10వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టి)లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు పొందారు.
బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్రో సైంటిస్టుగా ఎంపిక కావడం విశేషం. రాజసింహ సాధించిన ఈ ఘనతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతం నుంచి అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు.