Home తెలంగాణ వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు.. నటుడు శివాజీ

వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు.. నటుడు శివాజీ

18
0

ఫిలింనగర్ ప్రతినిధి( ఆర్గాన్ న్యూస్)

జీవనోపాధి కోసం ఈ రంగంలోకి వచ్చినవాడినని, ఇక్కడ అవకాశం లేకపోతే మరెక్కడైనా జీవించుకుంటానని కానీ తన ఆత్మగౌరవాన్ని మాత్రం త్యాగం చేయనని శివాజీ స్పష్టం చేశారు. వ్యవస్థలకు, పరిశ్రమకు గౌరవం లేకుండా విలువలేని జీవితం గడపడం తన వల్ల కాదన్నారు. ఇకపై ఎవరికైనా సలహాలు ఇవ్వడం, మంచిమాటలు చెప్పడం అవసరం లేదని తనకు అనుభవంతో అర్థమైందని వ్యాఖ్యానించారు. హెచ్చరికలు ఇస్తే భయపడిపోయే వ్యక్తిని తాను కాదని కూడా ఆయన తేల్చిచెప్పారు.శివాజీ మాట్లాడుతూ తన మాటలను వక్రీకరించి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సమాజంలో విలువల గురించి మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని, తన భావాలను మాత్రమే వ్యక్తపరిచానని చెప్పారు. వ్యక్తిగత గౌరవం, ఆత్మాభిమానం ఉన్నంత కాలం ఎవరి ఒత్తిళ్లకైనా లొంగనని, అవసరమైతే ఒంటరిగా నిలబడతానని స్పష్టం చేశారు.
సలహాలు, సూచనల యుగం ముగిసింది అని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో నిజం మాట్లాడే వారికి స్థానం లేకుండా పోతుందనే భావన కలుగుతోందని శివాజీ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తాను ఎదుర్కొంటున్న పరిణామాలు ఇతరులకు ఒక పాఠం కావాలని, అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ, ఎలాంటి వివాదాలకు అతీతంగా తన ప్రయాణం కొనసాగించానని గుర్తు చేశారు. తన పేరు మీద నిర్మించుకున్న గౌరవం ఒక్క రోజులో కూల్చేయలేమని, నిజాయితీగా జీవించడం తన సిద్ధాంతమని చెప్పారు. అవసరమైతే కష్టాలు భరించడానికి సిద్ధమే కానీ, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని మాత్రం చేయనని శివాజీ మరోసారి దృఢంగా ప్రకటించారు.