Home తెలంగాణ ఇదెక్కడి న్యాయం? అనుమతి ఒకచోట నిర్వహణ మరోచోట?

ఇదెక్కడి న్యాయం? అనుమతి ఒకచోట నిర్వహణ మరోచోట?

44
0
  • నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ ప్రశ్న ? రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఫిబ్రవరి 17: శంషాబాద్ జోన్ లోని బడంగ్ పేట లార్డ్స్ పాఠశాల భవనం పై అంతస్తులు శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రైవేటు హాస్టల్ నిర్వహణ ఎంతవరకు సబబు? అని నవతెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగ గంటి రంజిత్ కుమార్ ప్రశ్నించారు. అనుమతులు భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని దీనిపై వెంటనే విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు విద్యాశాఖ అధికారులకు బుధ గురువారాల్లో తమ వినతి పత్రాలు అందజేస్తూ వారిని అప్రమత్తం చేస్తామని ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే పైన ఉన్న విద్యార్థులకు ఎవరు బాధ్యులు అని గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిర్మించుకున్న భవనాలపై అమాయకులైన విద్యార్థులను బలి చేయడం న్యాయమా అని ప్రశ్నించారు రాజ్యం రాజ్యాంగం మన చేతుల్లో ఉందని అమాయకులైన బిడ్డలను బలి చేయకుండా వారికి ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని రంజిత్ కోరారు.