- ఖమ్మం పాత బస్టాండ్ నుండి ఘనంగా ‘అరైవ్ – అలైవ్ ’ రోడ్డు భద్రత ర్యాలీ
ఖమ్మం వన్ టౌన్, ఆర్గాన్ న్యూస్ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని ఘనంగా మరియు విస్తృతంగా నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీజీఎస్ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ , ఆర్టీఓ కార్యాలయం అధికారి దినేష్ ర్యాలీని ప్రారంభిస్తూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిర్లక్ష్యం ప్రాణనష్టాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ఖమ్మం పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని మయూరి సెంటర్ మీదుగా బస్ డిపో వరకు భారీ స్థాయిలో నిర్వహించబడింది. ర్యాలీ సందర్భంగా ప్రజలకు రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించడం, అతివేగం నివారించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగించాలనే అంశాలపై గట్టిగా అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో TGSRTC అధికారులు, సిబ్బంది , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించేలా కృషి చేశారు.


