Home Uncategorized మనువాదం మహిళలకు మొదటి శత్రువు

మనువాదం మహిళలకు మొదటి శత్రువు

14
0

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో ప్రముఖ మీడియా విశ్లేషకురాలు పి ఏ దేవి

సమాజ ప్రగతికి మహిళలే మూల స్తంభాలు

ఐసిడిఎస్ డిడబ్ల్యుఓ లెనినా

కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 9:మహిళలను అన్ని విధాలుగా పురుషుడి ముందు సమాజం ముందు అణిగిమనిగి ఉండాలని చెప్పే మనువాద భావజాలమే మహిళలకు మొదటి శత్రువు అని ఈ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రముఖ మీడియా విశ్లేషకురాలు సామాజిక కార్యకర్త పిఏ దేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో సిఐటియు, ఐద్వా ,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పి.ఎ.దేవి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇంటి పని కోసం పిల్లల మరియు వృద్ధుల సంక్షేమం కోసం మహిళ 10 గంటలకు పైగా శ్రమిస్తుందని ఈ శ్రమకు ఎక్కడ లెక్కింపు లేదని పేర్కొన్నారు. మహిళలను ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా చూస్తున్నాయి తప్ప చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు. ఉత్పత్తిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు ఉత్పత్తిలో రావలసిన వాటా రాకుండ దూరం పెడుతున్నారని విమర్శించారు. అత్యాచారాలు, వేధింపులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన సామాజికపరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ,బిజెపి, తెలుగుదేశం నాయకులు పిల్లల్ని కనాలి కనాలి అని బాగా ప్రచారం చేస్తున్నారని ఈనాయకుల దృష్టిలో మహిళలు పిల్లలను కానెయంత్రాలు తప్ప మనుషులుగా గుర్తించడం లేదనిఅన్నారు. ఇది సమాజంలో పెరిగిపోతున్న వివక్షతకు , మనువాద భావజాలానికి నిదర్శనమని దేవి పేర్కొన్నారు. సమాజం ఆర్థిక, సామాజిక , రాజకీయ రంగాల్లో ప్రగతి సాధించిందని, విశ్వ గురువులని ఉదర కొట్టుకుంటున్న పాలకులు దేశంలో నిరుద్యోగాన్ని, వరకట్నాన్ని, పేదరికం ఆకలి చావులు,రైతుల ఆత్మహత్యలను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
మహిళలకు సమానత్వం, సమాన హక్కులు ,శ్రమ దోపిడి నుంచి విముక్తి కావాలి అంటే సోషలిజం మాత్రమే మార్గమన్నారు. అందుకోసం పోరాటాలను ఉధృతం చేయాలని విశాలమైన కార్మిక వర్గ ఉద్యమాలతో మహిళలను మమేకం చేసి సంఘటితం చేయాలని విజ్ఞప్తి చేశారు.

*సమాజ ప్రగతికి మహిళలే మూలస్ధంబాలు
ఐ సి టి ఎస్ డి డబ్ల్యూ ఓ లెనినా

సమాజ ప్రగతికి మహిళల శ్రమ కీలకమని, అభివృద్ధికి మహిళలే మూల
స్ధం భాలని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా డి డబ్ల్యూ ఒ లెనినా అన్నారు. మహిళల శ్రమ లేకుండా సమాజం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. కుటుంబం ముందుకు పోవాలన్న మహిళ కీలకమని పేర్కొన్నారు. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సక్రమంగా, పటిష్టంగా అమలు జరిపే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. మహిళల్లో ప్రశ్నించే తత్వం మరింత పెరగాలని పేర్కొన్నారు. సమాజానికి సామాజిక సేవలను అందించడంలో మహిళా కార్మికులే అత్యంత కీలకంగా పని చేస్తున్నారని తెలిపారు. అంగన్ వాడి, ఆశా కమిడ్ డే మీల్ తదితర స్కీముల వల్ల పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి అంటే అందుకు ఆయా రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళ ప్రధాన కారణమన్నారు. వారి శ్రమను సమాజం గుర్తించడంతో పాటు ప్రభుత్వాలు మెరుగైన సౌకర్యాలు హక్కులను కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.. సమాజంలో వరకట్నం, మద్యం బల్యావివాహాలు, వంటి అనేక చెడు లక్షణాలు పెరుగుతున్నాయని వీటికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘాలు సంస్థలు మహిళలపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళ హక్కుల కోసం వారి సమస్యలపై చర్చించడం కోసం ఏర్పడిన వేదిక అని గుర్తు చేశారు. ఈ జిల్లా సదస్సుకు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ జి పద్మ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21 వ వార్డు కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీల జిల్లా మహిళా కన్వీనర్ శెట్టి వినోద రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు శ్రీదేవి సిఐటియు జిల్లా కార్యదర్శి జే రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరికృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. బ్రహ్మాచారి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలమంచి వంశీకృష్ణ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు సిఐటియు కొత్తగూడెం పట్టణ కన్వీనర్ భుక్యా రమేష్, ఐద్వా కొత్తగూడెం అధ్యక్షురాలు అన్నవరపు ఇందిర, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ వజ్జా.సుశీల ఎస్ ఎ నబి ,కె.సత్య దొడ్డ రవికుమార్ ,ఐద్వా నాయకురాలు వాణి వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు పద్దం సుగుణ, అబీద తదితరులతోపాటు మహిళాకార్మికులు,విధ్యార్ధినీలు,మహిళాకూలీలు,మహిళా రైతులు పాల్గొన్నారు