- మంగపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి పొదేం మేనక
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 28:
జడ్పిహెచ్ఎస్ మంగపేట ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహణ
జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ మంగపేట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పొదేం మేనక ఆధ్వర్యంలో సైన్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయులు
మాధురీదేవి క్రాంతి వెంకటేశ్వర్ రెడ్డి నాగేందర్ ల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పలు శాస్త్రీయ నమూనాలను రూపొందించి ప్రదర్శించారు. విద్యుత్ ఉత్పత్తి విధానాలు పర్యావరణ పరిరక్షణ సౌరశక్తి వినియోగం జల సంరక్షణ తదితర అంశాలకు సంబంధించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రత్యక్ష శాస్త్ర ప్రయోగాలను చూపిస్తూ శాస్త్రం మన దైనందిన జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఉపన్యాస పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారి ప్రతిభను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయులు నాగేశ్వర రావు అనంతరావు
చంద్రశేఖర్ అనసూయ
సునీత సతీష్ నాగేందర్ రాజు రమేష్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.








