Home Uncategorized భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

14
0
  • యూఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 23:

విప్లవ వీరులు భగత్ సింగ్, శివరామ్ రాజగురు, సుఖ్‌దేవ్ థాపర్ల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని యూఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ డిమాండ్ చేశారు.
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సోమవారం భగత్‌నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతిని ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహిస్తారని తెలిపారు. 1931 మార్చి 23న లాహోర్ జైలులో భగత్ సింగ్‌తో పాటు రాజగురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని గుర్తు చేశారు. ఈ దినాన్ని దేశవ్యాప్తంగా “అమరవీరుల దినోత్సవం”గా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
విప్లవ వీరుల త్యాగాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు పోరాడారని, కుల వ్యవస్థ నిర్మూలనపై స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు భగత్ సింగ్ ఆలోచనలు మార్గదర్శకమని అన్నారు. యువతలో చైతన్యం పెంచేందుకు వారి చరిత్రను విద్యా పాఠ్యాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కుమార్, రాజు, నైనేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.