Home తెలంగాణ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు

15
0
  • సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఆర్గాన్ న్యూస్ త్రీ టౌన్,ఖమ్మం:

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
నకిలీ వాట్సాప్/SMS లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, KYC అప్‌డేట్ పేరుతో OTP అడగడం వంటివి మోసపూరిత చర్యలలో నేరగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి, తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్యాస్ కొరత ఉందని, వెంటనే బుక్ చేసుకోండి” అని వచ్చే సందేశాలు లేదా వాట్సాప్ లింక్‌లను నమ్మవద్దని, ఇవి వ్యక్తిగత వివరాలను, డబ్బును దొంగిలించడానికి పన్నే పన్నాగంగా గ్రహించాలన్నారు.
అదేవిదంగా గ్యాస్ సిలిండర్ డెలివరీకి ముందు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ పేమెంట్ చేయమని కోరితే అది మోసమని గ్రహించాలని,OTP/UPI పిన్ షేర్ చేయవద్దని, KYC అప్‌డేట్ లేదా సబ్సిడీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి OTP, బ్యాంక్ వివరాలు, లేదా UPI పిన్ అడిగితే అస్సలు చెప్పకూడదన్నారు.
గ్యాస్ సిలిండర్‌ను అధికారిక మొబైల్ యాప్‌లు, ఏజెన్సీ వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలన్నారు.
తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని,
ఒకవేళ మోసపోతే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలన్నారు.