రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి :24
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 1997-1998 సంవత్సరంలో పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలక సభ్యుడి స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శి వరకు ఎదిగిన ఆదివాసీ తెగకు చెందిన పేద ప్రజల ఆదివాసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి దామోదర్ ఇతను చినబోయినపల్లిలో పదవ తరగతి చదువుతూనే రాడికల్ విద్యార్థి సంఘం లో పనిచేస్తూనే ఇంటర్ మీడియాట్ గోవిందారావుపేటలో చేస్తున్న క్రమంలో పోలీసుల ఒత్తిడి రావడంతో ఇతను మావోయిస్టు పార్టీలోకి వెలినారు.ఇతను మావోయిస్టు పార్టీలోకి వెళ్లి 28 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుకన్నా… ఊరు మిన్న అనే కార్యక్రమం ద్వారా బడే దామోదర్ తల్లి ఇంటికి రా బిడ్డ… అని పిలుపునిచ్చిన సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో ఇక విప్లవ పార్టీలకు స్థానం లేదు అనేది మావోయిస్టు కీలక నేతలను చుస్తే ప్రజలకు అర్ధం ఆవుతుంది. లొంగు బాటులో ముక్కుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపాలి గ్రామానికి చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు తో సహా
దేవ్ జీ మరో నలుగురు టాప్ నక్సల్ లీడర్స్ లొంగుబాటు
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఇద్దరు కీలక నేతలు మల్లా రాజిరెడ్డి నూనె నరసింహారెడ్డిలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు.








