Home ఖమ్మం ప్లాస్టిక్ వద్దు.. చేతి సంచులు ముద్దు..

ప్లాస్టిక్ వద్దు.. చేతి సంచులు ముద్దు..

20
0

తిరుమలాయపాలెం, ఆర్గాన్ న్యూస్, జనవరి 5:

స్థానిక గ్రామంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం నాల్గవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్లాస్టిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, భవిష్యత్తు కాపాడుకుందాం, ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు, నా చేతిలో సంచి ప్రకృతి భవిష్యత్తు , చెట్లు పెంచండి ఆరోగ్యంగా జీవించండి , ప్లాస్టిక్ కాదు జీవితం కావాలి , మీ వాహనంలో ఎల్లప్పుడూ రెండు క్లాత్ బ్యాగ్స్. స్టీల్ వాటర్ బాటిల్, గ్లాసులను తీసుకెళ్లండి, ప్లాస్టిక్ లేకుంటే కాలుష్యం ఉండదు, చెట్లు నాటుదాం ఆరోగ్యంగా ఉందాం అనే స్లొగన్స్ తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తిరుమలాయపాలెం లో శ్రమదానం నిర్వహించి హాస్పిటల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు , ,వార్డు మెంబర్లు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు జి కనకలక్ష్మి సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ సుజాత పాల్గొన్నారు. సర్పంచ్ ధరావత్ సుజాత మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుంటు , సమాజం పట్ల మంచి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మా గ్రామంలో శీతాకాల శిబిరం నిర్వహించడం మాకు ఆనందంగా ఉందని విద్యార్థులు మంచి మార్కులతో పరీక్షలు పాస్ కావాలని కోరారు . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్యామలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, సమాజం పట్ల సేవాభావం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చెట్లను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ రామ కుమారస్వామి మాట్లాడుతూ , తల్లి గర్భంలో శిశువు 9 నెలలు మాత్రమే ప్రాణంతో ఉంటుందని , మనిషిని 90 సంవత్సరాలు ప్రాణంతో ఉంచేది చెట్లు ఇచ్చే ఆక్సిజన్ అని , కాబట్టి చెట్లను ప్రతి ఒక్కరు పెంచాలని, పచ్చని ప్రకృతి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు . భోజనం కార్యక్రమం అనంతరం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు . కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ కనక లక్ష్మీ విద్యార్థులతో క్యాన్సర్ రాకుండా కుటుంబ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు . విద్యార్థులు పౌష్టికాహారం తీసుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. మహిళల ఆరోగ్య విషయాలను తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో అవగాహన లేకుండా ఇచ్చే ఆహారపు అలవాట్లు చూడవద్దని, నిజంగా మీ శరీరం ఏం చెప్తుందో అది గమనించాలని తెలియజేశారు. ఫోన్ లో అనవసరమైన చెత్త విషయాలను చూడవద్దని వివరించారు. సెల్ ఫోన్ చూడడానికి కూడా కొంత చిన్న సమయం కేటాయించుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ కుమారి, పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి శ్రీదేవి మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.