Home Adyatmikam మాగ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క సారలమ్మ జాతర

మాగ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క సారలమ్మ జాతర

34
0
  • ఘనంగా ప్రారంభమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర
  • హనుమంతుని రక్షా కవచం నీడలో సారలమ్మ దేవత మేడారానికి..
  • మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, జనవరి 28:

​మేడారం అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది.
​గద్దెల శుద్ధీకరణ బుధవారం ఉదయం 11:00 నుండి 12:00 గంటల మధ్య సమ్మక్క సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు.
​ఆదివాసీ సంప్రదాయం గొట్టు గోత్రాల ప్రకారం ఆదివాసీ సాంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు కుంకుమ చీర సారెలను సమర్పించి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​సారలమ్మ రాక సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల సమయంలో కన్నెపల్లి నుంచి హనుమంతుని రక్షా కవచం నీడ లో సారలమ్మ దేవత బయలుదేరి రాత్రి 9:00 నుండి 10:00 గంటల మధ్య మేడారం గద్దెలకు చేరుకున్నారు.
​దేవతల ఆగమనం అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు.
​కళ్యాణ మహోత్సవం మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవార్లకు పగిడిద్ద రాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
​ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ప్రభుత్వం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వారు తెలిపారు.