Home POLITICS ఇది అహంకారానికి ఆత్మీయతకి పోటీ

ఇది అహంకారానికి ఆత్మీయతకి పోటీ

19
0

ఎర్ర జెండా లేదన్న వాళ్ళు ఎందుకు హైరానా పడుతున్నారు

ప్రజా ఆశీర్వాదమే మా బలం

ఎర్ర జెండానే పేదలకు అండ

మేయర్ పీఠం మనదే
కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ ఫిబ్రవరి 9: ఇది అహంకారానికి ఆత్మీయతకి మధ్య జరుగుతున్న పోటీ అని, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆత్మ గౌరవాన్ని నిలుపుకుందామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగాసోమవారం రామవరంలోని ఆరు డివిజన్లు, బర్మా క్యాంపు, ప్యూన్స్ బస్తి ఏ-పవర్ హౌస్ బస్తీ, గంగా బిషన్ బస్తీలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఎర్రజెండాది ఏముందిలే అంటూ అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లు సిపిఐకి అందుతున్న ఆదరణను చూసి ఎందుకు హైరానా పడుతున్నారని అన్నారు. పాల్వంచ మొదలుకొని కొత్తగూడెం. సుజాతనగర్ వరకు ఉన్న కార్పొరేషన్ 60 డివిజన్లు ఎరుపు పసుపు రంగుల జెండాలతో రెపరెపలాడుతున్నాయని చెప్పారు. కార్పొరేషన్ కాకుండా చాలామంది అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని, కానీ వారి ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వంతో కొట్లాడి కార్పొరేషన్ను ఏర్పాటు చేసుకున్నామని, తద్వారా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని, పారిశ్రామిక, విద్య, వైద్యరంగాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి పెద్ద ఎత్తున నిధులను సమీకరించి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కొనసాగిస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, ఎర్త్ యూనివర్సిటీ తీసుకొచ్చామని, ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు దేశ విదేశాల నుండి విద్యార్థులు శాస్త్రవేత్తలు తరలి రాబోతున్నారని తెలిపారు. సింగరేణి సౌజన్యంతో బస్టాండ్ ఏరియాలో రోడ్ల వెడల్పుతో పాటు నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు తీసుకొస్తున్నామని, సింగరేణి కార్మిక సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి కార్మికుల శ్రేయస్సుకు ఎర్ర జెండా పాటు పడుతుందని తెలిపారు. పేదలు బడుగు బలహీన వర్గాల కోసం కార్మికులు కర్షకులు చేతివృత్తిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేదలకు అండగా ఉండేది ఎర్రజెండానే అని ఈ వందేళ్ళ కాలంలో అది నిరూపితమైందని తెలిపారు. ప్రజా ఆశీర్వాదమే మనకు బలమని. కంకి కొడవలి గుర్తుకు ఓటేసి సిపిఐ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా సుపరిపాలనను స్వాగతించినట్లు అవుతుందని అన్నారు. కార్పొరేషన్ వ్యాప్తంగా చక్కటి ఫలితాలు రానున్నాయని, మేయర్ పీఠం మనదే అని చెప్పారు.