Home తెలంగాణ ఇరుకు దారితో ఇక్కట్లు !

ఇరుకు దారితో ఇక్కట్లు !

11
0
  • కంకర తేలి గుంతల మాయమైన రహదారి
  • సీసీ రోడ్డు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల విజ్ఞప్తి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 1: అసలే ఇరుకు రహదారి దానికి తోడు గుంతలు దీనితో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట కూడలి సమీపంలోని వైన్ షాప్ ఎదుట దారి పాడు అవడంతో రద్దీ వేళ్ళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గతంలో మీర్పేట అల్మాస్గూడ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో విస్తరించి అభివృద్ధి చేశారు రోడ్డంతా విశాలంగా ఉన్నప్పటికీ ఇక్కడకు వచ్చేసరికి ఇరువైపులా ఎరుకుగా ఉండడం బస్సు లేదా ఏదైనా పెద్ద వాహనం వస్తే ఇతర వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. రోడ్డుకు ఒకవైపు వైన్ షాపు కు వచ్చే వాహనాల పార్కింగ్ మరో వైపు టిఫిన్ సెంటర్ ఇతర షాపులు ఉండడంతో రహదారి ఇరుకుగా మారింది నిత్యం ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని వాహనదారులు వాపోతున్నారు. మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం అధికారులు ఈ రహదారికి ఎన్నిసార్లు మరమ్మత్తులు చేసిన వారం రోజులు తిరిగేలోపు సమస్య మళ్ళీ మొదటి వస్తుందని రోడ్డుకు ఆనుకొని ఉన్న టిఫిన్ సెంటర్ ఇతర షాపులో నిర్వాహకులు రోడ్డుపైననే వాడిన నీటిని పారబోస్తూ ఉండడంతో కంకర తేలి రోడ్డు గుంతల మయంగా మారుతుంది అని వాహనదారులు ఆరోపిస్తున్నారు డాంబర్ వేసి ఎన్నిసార్లు మరమ్మతు చేసిన లాభం ఉండదని శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే రహదారి ఇరుకుగా గుంతలు ఏర్పడ్డచోట సిసి రోడ్డు వేయాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు.