- పెట్రోల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్న జనం రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 24: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి అల్మాస్గూడ కమాన్ వద్ద ఉన్న బంకు వందలాదిమంది వాహనాలతో వచ్చి పెట్రోల్ కోసం పడి కాపులు కాస్తున్నారు. వాహనాల్లో దించుకోవడంతో పాటు క్యాన్లు సీసాలలో పెట్రోల్ తీసుకొని వెళుతున్నారు దీనితో పెట్రోల్ బంక్ లో మరొక 24 గంటలు మాత్రమే స్టాక్ ఉంటుందని అల్మాస్గూడ కమాన్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ మేనేజర్ శివ మా ప్రతినిధికి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న యజమానులు అల్మాస్ గూడ పరిధిలోని అనేక బంకులలో పెట్రోల్ విరివిగా ఉన్న కొన్ని బంకుల యజమానులు పెట్రోల్ నో స్టాక్ అనే బోర్డును బంకుల ముందు వేలాడదీస్తున్నారు. దీనితో బెంబేలెత్తిపోతున్న వాహనదారులు పెట్రోలు దొరకదేమో అనే భయంతో క్యాన్లు సీసాలలో నింపుకొని పోవడం మా ప్రతినిధి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక బంకులలో సిబ్బంది పెట్రోలు లేక పని లేక ఊరికే కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తప్ప తమ బ్రతుకు బండి లాగడం కష్టమవుతుంది అనే భావనను వ్యక్తం చేశారు.


