హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 1: మానవుడు ప్రకృతి కంటే భిన్నమైన వాడు కాదు అని చెట్టు శ్వాస విడిస్తే మనం శ్వాస తీసుకోగలమని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నది ప్రవహిస్తేనే మన రక్తం ప్రవహిస్తుందని ప్రకృతి మనిషిని ఎన్నడూ వెలివేయలేదని, మనం ఎంతగా గాయపరిచిన వసంతం రాగానే చెట్లు మళ్లీ పూలు పూస్తూనే ఉంటాయని, అన్నారు. ఈ అపారమైన కరణను అర్థం చేసుకున్నప్పుడే మనిషి తన అహాన్ని( ఇగో ) వీడి అస్తిత్వంలోకి మారుతాడని ఇప్పటికైనా సమాజం తన ఆర్థిక సూత్రాలను ప్రకృతి నియమాలకు అనుగుణంగా మార్చుకోవాలని కోరారు. మన జీవితం అంతులేని పరుగు పందెం మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచం ఒక వింతైన అంతులేని పరుగు పందెం లో ఉందని అన్నారు ఈ పరుగులో మనిషి పక్కన ఉన్న తోటి మనిషిని దాటి పోవాలని చూస్తున్నాడని, వీలైతే తనను సాకుతున్న ప్రకృతిని కూడా లొంగదీసుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి సమాజం ప్రకృతి అనేది ఒక సజీవ గర్భమని అయితే అందులో జన్మించిన శిశువు మనిషి అని అన్నారు. ఆ శిశువులు కలిసి ఆడుకునే ఆటస్థలం సమాజం కానీ నేడు ఆ రాగం అపశృతిగా మారిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా సభలు జరుగుతున్న చట్టాలు వస్తున్న కోట్లాది రూపాయల బడ్జెట్లో ఖర్చు అవుతున్న ఇవన్నీ భయం నుండి పుడితేనే తప్ప హృదయం నుండి కాదు అన్నారు. ఈ తరుణంలో ప్రముఖ తాత్వికుడు ఓషో చెప్పిన చిన్న సూత్రం మనం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది అన్నారు. “మనం ప్రకృతిని రక్షించాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రేమలో పడితే చాలు మనం ప్రేమించే దానిని ఎప్పుడూ నాశనం చేయలేదు” అన్నారని అన్నారు. భయం కాదు ప్రేమే మార్గం భయం కాదు ప్రేమే మార్గం ఈరోజు సమాజం పర్యావరణాన్ని కాపాడాలని మాట్లాడుతుంది ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే రేపు గాలి దొరకదు నీరు దొరకదు మానవాళి అంతమైపోతుంది అనే భయం వల్ల అన్నారు. తాత్విక కోణంలో చూస్తే భయం ఎప్పుడూ తాత్కాలికమైనదే అన్నారు. భయం ఉన్నచోట స్వార్థం ఉంటుంది తప్ప సమర్పణం ఉండదని అన్నారు. ఓషో దృష్టిలో ప్రకృతి అంటే కేవలం ఓనర్ల కూర్పు కాదు భగవంతుడి భావ్య రూపం అన్నారు. మనిషి తన అహాన్ని ( ఇగో ను ) సంతృప్తి పరచడానికి ప్రకృతిని లోవర్ చేసుకోవాలని చూస్తున్నాడని ఒక పర్వతాన్ని చూసినప్పుడు ఒక తాత్వికుడు దాని అందాన్ని చూసి పరోసిస్తాడు కానీ ఆధునిక మనిషి దానిని పగలగొట్టి గ్రానైట్ రాయిగా ఎలా మార్చాలని లెక్కలేస్తాడని అన్నారు. ఒక అందమైన నదిని చూస్తే మైనింగ్ ఎలా చేయాలనే ఆలోచిస్తాడని ఒక చెట్టును చూసినప్పుడు దానిని కేవలం ఒక కలపలాగానో చూడడం మనిషి అహానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అదే మనిషి ప్రకృతితో ప్రేమలో పడితే చెట్టులో దైవత్వాన్ని చూస్తాడని నదీ ప్రవాహంలో జీవన నాదాన్ని వింటాడని ఒక తల్లి తన బిడ్డను పెంచడానికి ఒక బాధ్యత లాగానే చట్టం చెబుతుందని చేయదని అన్నారు. ఆమెలో బిడ్డ పై ప్రేమ ఉంటుంది కాబట్టి ఎంత కష్టమైనా ఆ బిడ్డను సాకుతుంది అని పేర్కొన్నారు. ప్రకృతి పట్ల మనిషి సమాజానికి కావలసింది సరిగ్గా ఈ మాతృదేమే అంటారు సమాజం అనేది ప్రకృతికి లోబడి ఉండవలసిన ఒక వ్యవస్థ అని అంటారు. ప్రకృతి మనిషికి స్వేచ్ఛనిస్తే సమాజం కట్టుబాట్లను ఇస్తుందని అయితే దురదృష్టవశాత్తు నేటి ఆధునిక సామాజిక పోకడ మనిషిని ఒక వినియోగదారునిగా ఒక యంత్రంగా మార్చేశాయని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన గుణాలను సమాజం శైశవ దశను తుంచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న పిల్లవాడు వర్షం పడితే కాగితం పడవ చేస్తాడు మట్టిలో ఆడుకుంటాడు చెట్లను తాకుతాడు అది సహజ సిద్ధమైన గుణం కానీ సమాజం ( తల్లిదండ్రులు పాఠశాల ) ఏం చేస్తుంది మట్టి అంటుకుంటుంది దూరంగా..రా వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది లోపలికి రా అంటూ వాడిని నాలుగు గోడల మధ్యన బంధించి కంప్యూటర్ స్క్రీన్ ల ముందు కూర్చోబెడుతుంది. ఇలాంటి ప్రకృతికి దూరమైన పిల్లలు రేపు పెద్దయ్యాక సమాజంలో యాంత్రిక జీవిగా మారి పోతున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రకృతి ( చెట్టునిడా స్వచ్ఛమైన గాలి ) సాక్షిగా సమాజం ( గ్రామస్తులు) కూర్చొని మనిషి తన కష్టసుఖాలు పంచుకునే వారు ఎక్కడ మానసిక ఒత్తిడి అనే పదానికి అర్థం లేదు అన్నారు కానీ నగరాలలో వందల అడుగుల ఎత్తున కాంక్రీట్ అపార్ట్మెంట్లు వచ్చాయని మనిషి ఏసీ గదిలో ఉంటాడు ఏసీ కార్లలో తిరుగుతాడు ఏసీ ఆఫీసులను పనిచేస్తాడని అన్నారు ఇదే పరిస్థితిలో పక్క ప్లాట్ లో ఎవరు ఉంటున్నారో తెలియని శూన్యత ప్రకృతి లేని కృత్రిమత్వం ఏర్పడుతుందని, ఫలితంగా మనిషి మానసికంగా కుప్పకూలిపోతున్నాడని సైక్రియాటిస్టుల దగ్గరకు వెళితే ఆధునిక మానవులకు ఓషో ఇచ్చే చికిత్స ఏమిటంటే కాసేపు చెప్పులు విప్పి పచ్చ గడ్డి పైన అడుగు ఒక చెట్టును గట్టిగా కౌగిలించుకో నీ ఒంటరితనం మాయమైపోతుంది ఎందుకంటే ప్రకృతి మనకు సహనం నేర్పితే సమాజం మనకు సహజీవనం అంటారు శ్రీనివాస్. ఇప్పుడు మనం ఒక చారిత్రాత్మక జంక్షన్లో నిలుచున్నాం కృత్రిమ మేధస్సు ( ఏఐ ) అంతరిక్ష యాత్రలు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కాలంలో రోజంతా స్క్రీన్ లతో మాట్లాడుతున్న మనిషి కాసేపు పక్కన తోటి మనుషుతో చుట్టూ ఉన్న ప్రకృతితో మాట్లాడడం నేర్చుకోవాలి తన కాళ్ళ కింద ఉన్న నేలను చుట్టూ ఉన్న సమాజాన్ని విస్మరిస్తే ఆ విజయాలకు అర్థం లేదు అందుకే ప్రకృతి ప్రేమలో పడాలి అనేది ఒక తాత్కాలిక నినాదం కాదు ఇప్పటికైనా సమాజం తన ఆర్థిక అసమానతలను ప్రకృతి నియమాలకు అనుగుణంగా మార్చుకోవాలి అన్నారు. మనిషి తన హృదయ కవాటాలను తెరచి ప్రకృతిని ఆలింగణం చేసుకోవాలి ప్రకృతి నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ సమాజాన్ని గౌరవిస్తూ సహజీవనం సాగించిన రోజే ఈ భూమిపై మానవ ఉనికి నిజమైన సార్ధకత పరమార్ధం లభిస్తాయని శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.