Home POLITICS పదవులు నాలుగు..ఆశావహులు డజన్లలో !

పదవులు నాలుగు..ఆశావహులు డజన్లలో !

16
0

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మార్చి 2 :

మిర్యాలగూడ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం అంశం స్థానిక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. భర్తీ చేయాల్సిన నాలుగు కో-ఆప్షన్ స్థానాల కోసం ఆశావహుల సంఖ్య డజన్లలోకి చేరడంతో పోటీ తీవ్రరూపం దాల్చింది.
అధికార పార్టీలోనే పలువురు నేతలు ఈ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అంతర్గత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక సమతుల్యత, అర్హతలు, పార్టీ సేవా చరిత్ర, స్థానిక ప్రభావం వంటి అంశాలు ఎంపికలో కీలక ప్రమాణాలుగా ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఆశావహులు పార్టీ ముఖ్య నేతలను సంప్రదిస్తూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరుచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మద్దతు కూడగట్టేందుకు తెర వెనుక చర్చలు జోరుగా సాగుతున్నాయి. పరిమిత స్థానాలే ఉండటంతో ప్రతి అభ్యర్థి తనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఆశతో కదులుతున్నారు.
కో-ఆప్షన్ సభ్యత్వంపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుండగా, తుది నిర్ణయం ఎవరికి వర్తిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంతో మున్సిపాలిటీలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టత పొందనున్నాయి.