Home తెలంగాణ ఏమి కొనేటట్ల లేదు.. ఏం తినేటట్ల లేదు…గుడ్డు ఎనిమిది రూపాయలు టమాటా 60 రూపాయలు

ఏమి కొనేటట్ల లేదు.. ఏం తినేటట్ల లేదు…గుడ్డు ఎనిమిది రూపాయలు టమాటా 60 రూపాయలు

23
0

రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ ఆగస్టు 24.

ఏం తినేటట్ల లేదు ఏం కొనేటట్ల లేదు అన్నట్టుగా తయారైంది సామాన్య మానవుడి పరిస్థితి. పెరిగిన ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్కు 500 పట్టుకెళితే సంచి కూడా నిండడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూరగాయలు దిగుబడిపై చలి ప్రభావం తగ్గిన దిగుబడి పెరిగిన వినియోగంతో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పెరుగుతాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి.

వంటింట్లో ధరల మంట పుడుతోంది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కూరగాయలు కొనాలంటే 100 నోట్లు తీయవలసి వస్తోంది అటు పౌల్ట్రీ రంగంలోనూ ఉత్పత్తి తగ్గడంతో కోడిగుడ్డు పై సైతం రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. దీనితో రంగారెడ్డి జిల్లా కేంద్రం ఇతర మార్కెట్లలో కూడా కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోయాయి. కూరగాయ ధరలు కిలోకి 60 నుండి 80 కి తక్కువగా లేకపోవడంతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. గడ్డి అన్నారం గుడిమల్కాపూర్ బోయినపల్లి మార్కెట్లలో రిటైల్ ధరలకు బహిరంగ మార్కెట్లో రిటైర్ ధరలకు కిలో పది నుండి 20 రూపాయల వరకు తేడా కనిపిస్తోంది గడ్డి అన్నారం మార్కెట్లో టమోటా ధర 41 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్ మాల్స్ లో 60 రూపాయలు పలికింది. వీర కాకర స్వర వంటి వాటి ధరలు గడ్డి అన్నారంలో కిలో 45 రూపాయలు ఉంటే బహిరంగ మార్కెట్లో 60 నుండి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కట్ట పది రూపాయలు పలికే పాలకూర తోటకూరలు ఇప్పుడు 20 నుండి 30 పలుకుతున్నాయి. అదే సమయంలో చికెన్ మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి హైదరాబాదు రిటైల్ మార్కెట్లో చికెన్ ధర కిలో 250 మటన్ తొమ్మిది వందల యాభై నుండి వెయ్యి రూపాయలు పలకగా, కోడిగుడ్డు రిటైల్ ధర ఎనిమిది రూపాయలుగా ఉంది.

చలి తీవ్రత – – -దిగుబడి పై ప్రభావం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తి పై పడింది. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పూత నిలవకపోవడం కాయ పెరుగుదల మందగించడం అంటే కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. డిసెంబర్ నెలలో ఇళ్లలో పాదులకు పెరిగే చిక్కుడు బీరకాయ కాకరకాయలు వంటివి కూడా చలి తీవ్రతతో దిగుబడి రాలేదని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కూరగాయలు సరఫరా అయ్యే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా మిర్చి తోటలు చలిదాటికి నల్ల భారీ పోవడంతో మార్కెట్కు వచ్చే సరుకు తగ్గిపోయింది. గత సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయి దీనితో రైతులు రెండో విడత సాగు చేయడానికి వెనుకడుగు వేశారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ తగ్గ సరఫరా లేక ధరలు పైపైకి పోతున్నాయి తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం 20 నుండి 30 శాతం తగ్గడంతో ఉత్పత్తి క్షమించింది వరి పత్తి వైపు రైతులు మల్లడం ఎరువులు విత్తనాల ధరలు పెరగడం కూడా మరొక కారణం.

కొండెక్కిన కోడిగుడ్డు

పేదల ప్రోటీన్ ఆహారమైన కోడి గుడ్డు ధర కూడా చుక్కలను తాకుతుంది. రిటైల్ మార్కెట్ ఒక్కొక్క గుడ్డు ధర ఎనిమిది రూపాయలకు చేరింది. పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపక వేయం పెరగడం గతంలో సోకిన కొన్ని వ్యాధుల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గడం దీనికి ప్రధాన కారణం చలికాలంలో డిమాండ్ పెరగడం పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడంతో కోడిగుడ్ల రేట్లు పెరిగాయి హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర 670 దాటడం గత కొన్ని సంవత్సరాలలో ఇదే మొదటిసారి ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్లు 700 కు చేరింది రిటైల్ ₹7.50 పైసల నుండి 8 రూపాయలు పలుకుతోంది కొన్ని పౌల్ట్రీ సంస్థలు అందిస్తున్న విటమిన్ గుడ్ల ధర 10 నుండి 12 వరకు పలుకుతుండగా నాటుకోడి గుడ్డు ధర 15 రూపాయల పైచిలుకు ఉంది.

సంక్రాంతి వరకు ఇంతేనా?

మార్కెటింగ్ వర్గాల విశ్లేషణ ప్రకారం రాబోయే సంక్రాంతి పండుగ వరకు ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు చలి తీవ్రత ఇలాగే కొనసాగితే దిగుబడి మరింత తగ్గి ధరలు మరో 20% వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మార్కెట్కు వెళ్లాలంటేనే భయం వేస్తోందని 500 రూపాయలు పట్టుకొని పెడితే సంచి నిండడం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.