- నూతన గ్రూప్ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచన
- జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకం పెంచాలి
- బిసి సడ్డీ సర్కిల్ లో కోచింగ్ తీసుకొని గ్రూప్ 3,4 లలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులను అభినందించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం,ఆర్గాన్, డిసెంబర్ 22:
ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ప్రభుత్వ బీసీ సడ్డీ సర్కిల్ నందు గ్రూప్ ఉద్యోగాలకు శిక్షణను తీసుకొని పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చి మెరుగైన ర్యాంకులతో గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ కు పూలమొక్కలను అందించి మర్యాదపూర్వకంగా కలిసారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమకం అయిన వారిని కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ…
ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోస్టింగ్ ఎక్కడ వచ్చిన మంచి పని చేస్తే గుర్తింపు వస్తుందని, ఉత్తమంగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఉత్తమ సేవలతో పనిచేసే శాఖకు, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని, మీపై అధికారులతో కలిసి వృత్తి పట్ల, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ఉత్తమ సేవలతో అందరి అభిమానం పొందుతూ మంచి పేరు తేచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ లో ఉత్తమైన శిక్షణ తీసుకొని దానికి పట్టుదల జోడించి చదువుకొని పోటీ పరీక్షలలో విజయం సాధించడం గర్వకారణం అని అన్నారు. ఉద్యోగం సాధించమని ఇక్కడితో ఆపకుండా ఉన్నత స్థానాలకు చేరుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
విజయం కోసం మాత్రమే పని చేస్తే మంచి ఫలితాలు రావాలని, మనం చేసే ప్రతి పని అద్భుతంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా విజయవంతం అవుతామని అన్నారు. మనం చేసే ప్రతి పనిలో 100 శాతం మనం దృష్టి పెట్టాలని అన్నారు.
మనకు సమాజం నుంచి నేర్చుకున్న పాఠాలు సరి చేసుకుంటూ పని చేస్తే విజయం సాధిస్తామని అన్నారు . ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని, దానినీ సాధించే దిశగా కృషి చేయడం వలనే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.
అనంతరం నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వారిని కలువా కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








