Home ఎడ్యుకేషన్ అంతరిక్ష సాగు ప్రాజెక్టుకు ఎంపికైన ‘పులి

అంతరిక్ష సాగు ప్రాజెక్టుకు ఎంపికైన ‘పులి

23
0
  • జమ్మిబండ నారాయణ స్కూల్ విద్యార్థి ఎంపిక
  • ఎన్‌ఎస్‌ఎస్ కాస్మోస్ కల్టివేషన్ ప్రాజెక్ట్‌కు పులి శశాంక్ సెలెక్షన్

ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 2:

ఖమ్మం జమ్మిబండ నారాయణ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి పులి శశాంక్ ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌ఎస్ కాస్మోస్ కల్టివేషన్ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యారు. అంతరిక్షంలో మొక్కల పెంపకం, భవిష్యత్తు వ్యవసాయ విధానాలపై పరిశోధన చేసే ఈ అరుదైన ప్రాజెక్ట్‌కు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా నారాయణ ఖమ్మం పాఠశాలల ఏజీఎం రామ్ కీ శశాంక్‌ను అభినందిస్తూ, ఈ విజయం పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
శశాంక్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.