ఖమ్మం, ఆర్గాన్, డిసెంబర్ 24:
ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 8,38,114.16/-లక్షలు రూపాయలు మోసం చేసిన కేసులో ఒక్కరినీ ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఖమ్మం జిల్లా ,ఖమ్మం రూరల్ మండల ఏరియా లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలానికి చెందిన జర్పుల విజేందర్ కి ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ మరియు ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 9 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను“ 12,604” రూపాయిలు అక్కౌంట్ కి వెళ్ళిన అక్కౌంట్ హోల్డర్ అయిన ఖమ్మం రూరల్ మండలం కి చెందిన హుస్సేన్ ను అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి. ఎస్పీ, హెచ్.ఆర్.వి. ఫణిందర్ గారిని మరియు అట్టి టాస్క్ లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండపర్తి నరేశ్ , ఎస్సైలు జి. రంజిత్ కుమార్ మరియు ఎం.విజయకుమార్ లను, హెడ్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస రావు , కానిస్టేబుల్స్ భాను మూర్తి , కిషన్ రావు , పగడాల శ్రీనివాస రావు లను మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి సునీల్ దత్ అభినందించారు.


