Home Uncategorized ఈ-బస్సులకు మెకానిక్ లే…డ్రైవర్లు- కండక్టర్లు

ఈ-బస్సులకు మెకానిక్ లే…డ్రైవర్లు- కండక్టర్లు

74
0

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 10

రానున్న ఆరు నెలలలో కేంద్రం నుండి రాష్ట్రానికి విడతల వారీగా 2000 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 700 వరకు ఇవి బస్సులు నడుస్తున్నాయి. భాగ్యనగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతుంది సంస్థ. ఇక్కడ నడుస్తున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో సిటీలో పనిచేస్తున్న డ్రైవర్లు మెకానికులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం కంటే ఇక్కడే ఎలక్ట్రికల్ బస్సులలో కండక్టర్లుగా డ్రైవర్లు గాని నియమించాలని భావిస్తోంది.
పీఎం ఈ డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించే ఈవీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడపాలని భావిస్తోంది. వీటి డ్రైవర్ గా ఓలేక్ట్రా సమస్త ఉద్యోగులే కొనసాగుతారు కేవలం ఆర్టీసీ నుంచి కండక్టర్లు మాత్రమే ఉంటారు దీని వల్ల సిటీలోనే ఆర్టీసీ డ్రైవర్లు మెకానికులకు స్థానికంగా పని లేకుండా పోతుంది. అందుకే వీరిని ఇవి బస్సులలో కండక్టర్లుగా పని చేయాలని రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం కోరుతోంది. ఇందుకు సుముఖత వ్యక్తం చేసే వారికి సిటీ లోనే అవకాశం కల్పిస్తారు. ఒకవేళ కండక్టర్లుగా పని చేసేందుకు ఇష్టం లేని డ్రైవర్లు మెకానికులను జిల్లాలలోని డిపోలకు కేటాయించనుంది. సిటీలో సుమారు నాలుగువేల మంది ఆర్టీసీ డ్రైవర్లు మరో నాలుగు వేల మంది మెకానికులు ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. కానీ కండక్టర్ గారు 200 మందికి అవకాశం ఉండడంతో మిగిలిన వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది కాగా ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా పూర్తిగా ఆర్టీసీకి అప్పగించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని యూనియన్ లీడర్లు కార్మికులు కోరుతున్నారు అప్పుడే సమస్త ఉద్యోగులకు జాబు సెక్యూరిటీ ఉంటుందని ఉద్యోగులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.