రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 21.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తనను, నగరంలోని ప్రసాద్ ల్యాబ్ లో 21వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, ప్రముఖ నిర్మాత మాదాల నాగూర్, వెండితెర ఆణిముత్యాలు శీర్షికన గౌరవ సన్మాన మహోత్సవం ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సామాజికవేత్త సోషల్ యాక్టివేషన్, విజయ శ్రీ రొడ్డా( బుజ్జమ్మ ) తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈ అవార్డు తీసుకునేందుకు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి హైదరాబాదు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాప్ట్స్ ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెండితెర ఆణిముత్యాలకు తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె అన్నారు.








