వాషింగ్టన్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ కు పిడుగులాంటి వార్త. జీవన వ్యయాలు పెరిగిపోయి పౌరులు వీధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశారు.
ముఖ్య అంశాలు:
నిర్ణయం: ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు.
నేపథ్యం: ఇరాన్ లో పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు ఆర్థిక సంక్షోభం.
ప్రకటన: డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.


