Home తెలంగాణ చౌక మందుల కోసం జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోండి

చౌక మందుల కోసం జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోండి

34
0
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 21:

రాష్ట్రంలో మందుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.
కరీంనగర్ నగరంలోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం భారంగా మారకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు అధికంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడం చాలా మందికి కష్టంగా మారిందని తెలిపారు. మందులు కొనలేక పేదలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సమాన నాణ్యత కలిగిన మందులు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మందుల అందుబాటు పెంచడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన ఔషధి కేంద్రాల ద్వారా చౌక ధరలో మెడిసిన్స్ పొందాలని మంత్రి కోరారు.