Home Adyatmikam భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం

భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం

17
0
  • దేవాలయ కోశాధికారి, వక్కలంక శ్రీనివాసరావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 12: దిల్ సుఖ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లో వ్రతం చేసుకుంటే తమ కోరికలు తీరుతాయని అశేష భక్తుల విశ్వాసమని, దేవాలయ కోశాధికారి, సెటిలర్, వక్క లంక శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నాడు దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దిల్సుఖ్నగర్ లలిత నగర్ లోని సత్యదేవుని ఆలయంలో కొలువుదీరిన సత్యనారాయణ స్వామి ఆలయం గడ్డి అన్నవర క్షేత్రంగా బాసిల్లుతోందని ఇక్కడి సత్యనారాయణ స్వామికి కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రఖ్యాతి ఉందని భక్తులు ఇక్కడికి వ్రతమాచరించేందుకు స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తుంటారని పేర్కొన్నారు నేత్రపర్వంగా కొలువుదీరిన సత్యనారాయణడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం గడ్డి అన్నవర క్షేత్రంగా విలసిల్లుతుందని ఐదున్నర అడుగుల విగ్రహ రూపంలో నేత్రపర్వంగా కొలువుదీరిన సత్యనారాయణ స్వామికి ఏడాది పొడవునా 365 రోజులు పూజలు వ్రతాలు జరుగుతూ ఉండడం విశేషమని 1999లో కంచి పీఠానికి అనుబంధంగా ఈ ఆలయ అంకురార్పణ చేయడం జరిగిందని కేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి పవిత్ర పూజలు నిర్వహించి ఇక్కడ స్వామి వారి విగ్రహం కింద యంత్రాన్ని ప్రతిష్టించారని ఆనాటి నుంచి నేటి వరకు కంచి పీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయం నిత్య పూజలతో విరాధిల్లుతుందని రెండు పుష్కరాలు గడిచిన అనగా 24 సంవత్సరాలు అవుతున్న నేటి వరకు కంచిపీఠం ఆధ్వర్యంలో ఆలయం నిత్య పూజలతో విరాజిల్లుతుందని వ్రతాలు జరుపుకునే దంపతులకు దేవస్థానం వారే నామమాత్ర రుసుముతో పట్టు వస్త్రాలు అందజేస్తారని పట్టు వస్త్రాలతో పాటు స్వామివారి వెండి విగ్రహం పూజా సామాగ్రి ప్రసాదం అందజేయడం విశేషమని అన్నారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాలు ధనుర్మాసంలో తిరుప్పావై గోదా కళ్యాణం పూజలు నిర్వహిస్తారని ఉగాది పంచాంగ శ్రవణం శ్రీరామనవమి రోజున స్వామి వారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించడం జరుగుతుందని ఏకాదశి పౌర్ణమిళ్ళలో వ్రతాలు చేసుకునే భక్తుల సందడి విపరీతంగా ఉంటుందని ముఖ్యంగా కార్తీకమాసంలో ప్రతిరోజు వ్రతాలతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుందని పౌర్ణమి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విడతల వారీగా వ్రతాలు జరుగుతుంటాయని స్వామి వారు మొక్కలు తీర్చే స్వామిగా పేరు ఉండడంతో ఇక్కడి వ్రతమాకరించే భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారని అన్నారు పౌర్ణమి ఏకాదశి కార్తీక మాసాలలో వ్రతాలు జరుపుకునే భక్తులు దేవాలయం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ఉంటుందని స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని తమ మొక్కులు తీరుతాయని ముఖ్యంగా ఈ ఆలయంలో వ్రతం జరుపుకుంటే తమకు శుభాలు కలుగుతాయని భక్తులు ఆశిస్తారని అన్నారు ఆలయ సెట్లర్ కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు ముఖ్యంగా సంతానం కళ్యాణం కోసం ఎంతోమంది ఇక్కడ వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ఉద్యోగస్తుల కోసం ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటలకు 10 గంటలకు వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు వ్రతం చేసుకున్న వారికి అన్న ప్రసాదం హాలును పూజారులకు రూములు కట్టడానికి దాతలు ముందుకు రావాలని ఆలయ ప్రధాన కార్యదర్శిచకిలం రమణయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు చైర్మన్ దేవరం లింగారెడ్డి మాట్లాడుతూ భక్తులు 25000 దేవాలయానికి ఇస్తే వారి గోత్రనామాలతో ప్రతిరోజు అర్చనతోపాటు పదేళ్లు పాటు ప్రతి ఏటా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చని పేర్కొన్నారు ప్రతిరోజు ఇక్కడ వ్రతం జరుపుకునే అవకాశం ఉందని భక్తులకు వ్రతం చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కలగజేస్తున్న అందరం భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవారం లింగారెడ్డి కోరారు భక్తుల మొక్కులు తీర్చే స్వామిగా పేరు ఉన్న ఈ ఆలయం తెలంగాణలో మరో అన్నవర క్షేత్రంగా అందుకే తెలంగాణ అన్నవరంగా బాసిల్లుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదని శ్రీనివాసరావు అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ సైనిక కార్యదర్శి భాషాపాక కుమార్ కెఎన్ రావు సలహాదారులు ఊరా నరసింహ గుప్తా సూరిశెట్టి వీరేశం నాగేందర్ మహేందర్ రెడ్డి ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఈ దేవాలయం నిత్యం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుందని శ్రీనివాసరావు వివరించారు.