Home తెలంగాణ రిజిస్ట్రేషన్ సేవల స్థంభన

రిజిస్ట్రేషన్ సేవల స్థంభన

13
0
  • సర్వర్ సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియలు నిలిపివేత

ఖమ్మం రూరల్,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 17:

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని ఆన్‌లైన్ సేవలు స్తంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారిక వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
ముందుగా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాలకు చేరుకున్నప్పటికీ సేవలు అందకపోవడంతో గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ-స్టాంప్ సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ డౌన్ అయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సేవలు పునరుద్ధరించే వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వాయిదా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అవసరం లేని రద్దీని నివారించేందుకు ప్రజలు కార్యాలయాలకు రావడం తగ్గించి, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని సూచించారు.