Home క్రైమ్ తిమ్మాపూర్ ఎల్‌ఎండీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

తిమ్మాపూర్ ఎల్‌ఎండీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

25
0
  • కిరీటం, అమ్మవారి నగలు సహా ఆభరణాలు మాయం
  • రూ.10 లక్షలకు పైగా నష్టం అంచనా మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 17:

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు సోమవారం సాయంత్రం పూజలు నిర్వహించి తాళాలు వేసి ఇంటికి వెళ్లగా, మంగళవారం తెల్లవారుజామున ఆలయం శుద్ధి కోసం వచ్చిన సిబ్బందికి తాళాలు పగలగొట్టబడినట్లు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది.
ఈ విషయాన్ని వెంటనే పూజారులకు తెలియజేయగా, వారు వచ్చి పరిశీలించగా స్వామివారి కిరీటం, అమ్మవారి నగలు మరియు ఇతర ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.
దొంగలు ఆలయ ద్వారం వద్ద గునపం, వాటర్ బాటిల్ ఉంచుకుని ప్రశాంతంగా చోరీ చేసినట్లు ఆనవాళ్లు లభించాయి. చోరీకి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని పండితులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫింగర్ ప్రింట్, క్లూజ్ టీంలకు సమాచారం ఇచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఎల్‌ఎండీతో పాటు మహాత్మానగర్ ప్రాంతంలో కలకలం రేపింది.