- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 9:
అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యులవ్వాలని, పారదర్శక పాలనకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏసీబీ ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కలెక్టర్ చేతుల మీదుగా అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అవినీతి నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ ఉద్యోగులెవ్వరైనా లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలి. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ సిబ్బంది ధర్మం అని పమేలా సత్పతి పేర్కొన్నారు.
కర్తవ్యపరమైన వైఖరితో, బాధ్యతతో పనిచేయాలంటూ అధికారులు, ఉద్యోగులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, ఇన్స్‌పెక్టర్ కృష్ణకుమార్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.


