Home agriculture ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

24
0

సూర్యాపేట ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్, మార్చి13:

సూర్యపేట జిల్లా చివ్వెంల మండలంలోని కుడకుడ క్లస్టర్ గాయంవారిగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA)” సహకారంతో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి. ఆదర్శ్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు
ప్రకృతి వ్యవసాయం ద్వారా గోమూత్రం పంట అవశేషాలు వంటి సహజ వనరులను ఉపయోగించి పంటలను సాగు చేయవచ్చని తెలిపారు జీవామృతం బీజామృతం మల్చింగ్ వంటి పద్ధతులను అనుసరించడం వల్ల మట్టిలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పంటల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు దీంతో రైతుల ఖర్చులు తగ్గి స్థిరమైన దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి అవుతుందని వివరించారు అలాగే పంట మార్పిడి విధానం పచ్చిరొట్ట ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా మట్టి సారవంతం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని సూచించారు రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ఆదాయం రెట్టింపు చేసే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల కోసం నిర్వహిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు రైతులకు అందుబాటులో ఉన్న ఉత్పత్తుల గురించి కూడా వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు వ్యవసాయ విస్తరణ అధికారి బి. శైలజతో పాటు రైతులు బానోతు శంకర్ దేవ్ సింగ్ కుసునోజు శ్రీనివాస్ ఎనిగ శంబరెడ్డి సామ బాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.