Home POLITICS రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు

రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు

13
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింగ్వి మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ సత్యనారాయణ, రాజ్యసభలో తెలంగాణ ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తదితరులతో కలిసి డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.