Home ఖమ్మం లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలి

లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలి

16
0
  • జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • లేఔట్ అనుమతికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం తప్పనిసరి
  • వాటర్ బాడీస్ ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ లలో ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దు
  • జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 5:

లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి పాల్గొన్నారు.
పెండింగ్ ఉన్న లేఔట్ అనుమతులపై కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించి, ప్రతి లే అవుట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి రిమార్క్స్, అభ్యంతరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ…

12 డ్రాఫ్ట్ లేఔట్, 4 ఫైనల్ లేఔట్ లను కమిటీ పరిశీలించిందని అన్నారు. లేఔట్ అనుమతులను మంజూరు చేసే సమయంలో తప్పనిసరిగా ఎటువంటి వాటర్ బాడి ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు.
లేఔట్ లో అప్రోచ్ రోడ్డు 18 మీటర్లు ఉండాలని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లే ఔట్ లో కేటాయింపులు జరిగేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. లేఔట్ ప్రాంతం నీటి వనరులు, నీటి ప్రవాహాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలని, ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ లలో అనుమతులు జారీ చేయడం కుదరదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్, మండల సర్వేయర్, ఆర్డిఓ లు సంయుక్తంగా లేఔట్ దరఖాస్తును చుట్టు పక్కల సర్వే నెంబర్లను పరిశీలించి రిపోర్ట్ అందించాలని అన్నారు.
లేఔట్ ప్రాంతంలో గతంలో ఏమైనా నీటి వనరులు ఉన్నాయా అని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా సాంకేతికతను వినియోగిస్తూ పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. లేఔట్ ఆమోద ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని, మనం జారీ చేసిన అనుమతుల నిబంధనలను అభివృద్ధి సమయంలో పాటిస్తున్నారు లేదో పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్.డి.సి. ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, పి ఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ. శ్రీనివాసా చారి, డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రాజేందర్, ఏదులాపురం టౌన్ ప్లానింగ్ అధికారి, ఈఈ ఇరిగేషన్ శ్రీనివాస రెడ్డి, డీఈ ఇరిగేషన్ కే. రాజేష్, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, శ్వేత, అరుణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.