Home POLITICS మిర్యాలగూడ మునిసిపల్‌లో నామినేషన్ల హోరు

మిర్యాలగూడ మునిసిపల్‌లో నామినేషన్ల హోరు

19
0
  • చివరి రోజున భారీగా దాఖలు

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్ జనవరి 30 :

మిర్యాలగూడ మునిసిపల్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగింది. నామినేషన్ల చివరి రోజున గురువారం ఒక్కరోజే మొత్తం 507 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భారీ సంఖ్యలో దాఖలుకావడంతో ఎన్నికల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. పార్టీల వారీగా ఈ రోజు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి 56, సీపీఎం నుంచి 11, కాంగ్రెస్ పార్టీ నుంచి 213, బీఆర్ఎస్ నుంచి 139, ఇతర పార్టీల నుంచి 19, ఇండిపెండెంట్లు 56, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 5, బీఎస్పీ నుంచి 5, మజ్లిస్ నుంచి 1, టీడీపీ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజుతో కలిపి మొత్తం 687 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికల్లో అసలు పోటీ తేలనుంది.