ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:హరీశ్ రావును వెంటాడుతున్న అవినీతి అక్రమాలు.. తప్పించుకునేందుకేనా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై అసత్య ఆరోపణలు?
రాజకీయంగా ఎదుర్కోలేకనే కదా వ్యక్తిగత విమర్శలు, రాఘవ కన్ స్ట్రక్షన్ పై నీ పొంతన లేని మాటలు?
నాడు ఉద్యమం ముసుగులో మీరు దందాలు చేసింది నిజం కాదా?
నేడు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను దోచుకుంది మీరు కాదా?
ధరణి పేరుతో దగాచేసి కొల్లగొట్టిన భూములు ఎన్ని?
కాళేశ్వరం పేరుతో కాజేసీన లక్ష కోట్ల గూడుపుఠాని గుట్టు విప్పు ?
నీకున్న వ్యాపారాలు ఏమిటి, నీకు వచ్చే ఆదాయం ఏంటి, నీకు కోట్ల సంపాదన ఎక్కడిది ?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్ స్ట్రక్షన్ తెల్లకాగితం లాంటిది..
పన్నులు కట్టి వ్యాపారం చేసిన కష్టార్జీతం, మరి మీకంత అంతులేని సొమ్ము ఎట్లొచ్చిందో ప్రజలకు చెప్పు
తోడుదొంగలు తొండి మాటలు బావ బావమరుదులు వేలు పెట్టని రంగం లేదు.. చేయని అక్రమం లేదు.
ఒకరేమో కాళేశ్వరం కేసుతో కకావికలం.. మరొకరెమో ఈ-ఫార్మూల రేసు కేసులో ఆగమాగం
ధరణి పేరుతో బావాబామ్మర్దుల గారడీ, సిద్ధిపేట, సిరిసిల్లలో 2000ల ఎకరాలకుపైగా భూ దోపిడీ
హరీశ్ అంటేనే మేక వన్నె పులివని, ఓ మాయమాటల మనిషని దగ్గరి వారికి తెలుసు
10 ఏండ్లు పాలించి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడినది మీరు కాదా?
అరెస్ట్ భయంతోనే మంత్రిగారిపై విష ప్రచారం చేస్తున్నారా?
నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం పొంగులేటి గారు. ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈ కుట్రలు?
మీరు చేసిన పాపాలు ఊరికే పోవు.. కర్మ ఫలం అనుభవించక తప్పదు


