- స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, జూన్ 10:
భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మంలోని స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి, సంక్షేమం, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య యాదవ్, బీజేపీ అర్బన్ టౌన్ అధ్యక్షుడు వాగదాని రామకృష్ణ, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ఈశ్వరప్రగడ రామారావు, మంద సరస్వతి, మారుతి, వీరభద్ర ప్రసాద్, అయ్యగారు, బోయినపల్లి సురేష్, రుద్రగాని మాధవ్, తాజ్నోత్ భద్రం, దాసరి వీరభద్రం, మణి, నాగమణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









