Home agriculture రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి సారించాలి…!

రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి సారించాలి…!

24
0

జిల్లాలో ఫ్యాక్టరీ రావడం శుభపరిణామం…

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి :07

సాగు విస్తీర్ణంలో మంగపేట ముందంజ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి డి.సంజీవరావు అన్నారు.సంవత్సరంలో ఫ్యాక్టరీ పూర్తవుతుందని ఏరియా మేనేజర్ హేమంత్ రెడ్డి కూడా అన్నారు.మంగపేట మండలంలోని రాజుపేట రైతువేదికలో ఉద్యాన వనశాఖ అధికారి కొప్పిరి లావణ్య అధ్యక్షతన ఆయిలపామ్ పై రైతులకు అవగాహన సధస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా జిల్లా ఉద్యనవన శాఖ అధికారి సంజీవరావు కె ఎన్ బయో సైన్సెస్ కంపెనీ ఏరియా మేనేజర్ హేమంత్ రెడ్డి హాజరయ్యారు. సంజీవరావు మాట్లాడుతూ తరతరాలుగా రైతులు సాంప్రదాయా వ్యవసాయం చేస్తూ నష్టాలను చవిచుస్తున్నారని ఉద్యనపంట ఐన ఆయిల్ ఫామ్ పై రైతులు దృష్టి సారిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగవుతుందన్నారు. జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రావడం శుభ పరిణామమని సాగు విస్తీర్ణంలో మంగపేట ముందంజలో ఉందని ప్రకటించారు. సాగు లో పాటించవలసిన మెలకువలు ప్రభుత్వం అందిస్తున్న అనేక రాయితీల గూర్చి వివరించారు.
కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఏరియా మేనేజర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు చైతన్యవంతులని ప్రభుత్వ చూచనలు పాటిస్తూ మున్ముందు సహచర రైతులను సైతం ఆయిల్ పామ్ పంట సాగుచేసేలా కృషి చేయాలన్నారు. ప్యాక్టరీ నిర్మాణపనులు జరుగుతున్నాయని సంవత్సరం లోపు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఏటూరునాగారం డివిజన్ ఉద్యనశాఖ అధికారి కోపిరి లావణ్య మాట్లాడుతూ పంట సాగు విధానం మొదటి దశ లో అంతరపంటల సాగు పంట కోత దశ తదితర విషయాల గురించి పూర్తి గా రైతులకు వివరించారు ఈ కార్యక్రమం లో స్థానిక ఏ ఈ ఓ మౌనిక కంపెనీ ఎగ్జిక్యూట్ ఆఫీసర్స్ సాంబశివరావు సురేష్ రాజుపేట బ్రాహ్మణపల్లి సంగంపల్లి నర్సింహాసాగర్ వాడగూడెం బోర్ నర్సాపురం మల్లూరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.