Home ఎడిటోరియల్ పెసా గ్రామ సభలు తీర్మానం లేకుండా కందకాలు తీయరాదు

పెసా గ్రామ సభలు తీర్మానం లేకుండా కందకాలు తీయరాదు

17
0
  • ఫారెస్ట్ ఆగడాలని ఆపాలి ఆదివాసి గిరిజనలపై మీ పెత్తనం ఏంటి
  • టి డి పి మండల అధ్యక్షులు చిలువేరు అన్నమయ్య

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 2:

ఏటూరునాగరం మండలం లో కొండాయి గ్రామపంచాయతీ మల్యాల గ్రామం చివరులో కంచ కొట్టడం పర్మిషన్ ఎక్కడిది? ఆదివాసిలు పోడు వ్యవసాయం చేసుకోవడానికి కనీసం రెండు మూడు ఎకరాలు పోడు చేసుకుంటే కానీ జీవనం కడవదు అలాంటిది ఫారెస్ట్ వాళ్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఆదివాసులపై జులుం చేస్తూ ఇలాంటి చేయకూడదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని ఏటూరునాగారం టి డి పి మండల అధ్యక్షులు చిలువేరు అన్నమయ్య అన్నారు. ఆదివాసిల జీవన విధానంలోని అయినటువంటి ఆవులు మేకలు పశువులు ఎక్కడికి వెళ్లి పశువులు ఏమి ఆహారం తీసుకోవాలి 5వ షెడ్యూల్లో గ్రామ సభ లేకుండానే కంచ కొట్టడం సరైనది కాదనీ చిలువేరు అన్నమయ్య అన్నారు.ఆదివాసి గూడాలలో ఇదే పరిస్థితులు ఉన్నాయి ఫారెస్టు డిపార్ట్మెంటు ఆలోచించాలని వారు అన్నారు.పెసా గ్రామ సభ తీర్మానలు లేకుండా ఏజెన్సీ గ్రామాలలో కాందాకాలు తీయడం మానుకోవాలనీ టి డి పి మండల అధ్యక్షులు చిలువేరు అన్నమయ్య అన్నారు.