Home Adyatmikam భద్రాచలంలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

భద్రాచలంలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

14
0
  • మే 21 ఉదయం 8 గంటలకు ప్రారంభం
  • సాయంత్రం 6 గంటలకు “శ్రీరామ వారి తిరువిడి సేవ”

భద్రాచలం, ఆర్గాన్ న్యూస్ , మే 20:

శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భద్రాచల క్షేత్రము చుట్టూ నిర్వహించే పవిత్ర “గిరిప్రదక్షిణ” కార్యక్రమం ఈ నెల 21న ఉదయం 8 గంటలకు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభం కానుంది.

దేవస్థానం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, అదే రోజు సాయంత్రం 6 గంటలకు “శ్రీరామ వారి తిరువిడి సేవ” కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. గాను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీరామ వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు కోరారు.
కావున భక్తులు తమ స్వీయ వాహనాలను దేవస్థానం ప్రాంగణం లేదా నిర్ణయించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేసి గిరిప్రదక్షిణలో పాల్గొనాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యాలయం వెల్లడించింది.