- అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 2:
బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే సూచించారు. స్నేహిత–2 అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె కేజీబీవీ తిమ్మాపూర్, కేజీబీవీ గన్నేరువరం పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థినీలతో మాట్లాడుతూ… ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భయపడకుండా హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని, సమస్యలను వెంటనే ఉపాధ్యాయులకు వివరించాలని సూచించారు. బాలికలు ధైర్యంగా, నిస్సంకోచంగా ముందుకు సాగాలని, అందరికంటే ముందుండి తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. స్నేహిత కార్యక్రమం ప్రాముఖ్యత, గ్రీవెన్స్ బాక్స్ వినియోగంపై కూడా విద్యార్థినీలకు అవగాహన కల్పించారు.
నేషనల్ లెవెల్ కలోత్సవ్‌కు ఎంపికైన కేజీబీవీ తిమ్మాపూర్ విద్యార్థినులను అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్స్ పడాల కిరణ్ జ్యోతి, కాచగాని మధులత, శ్రీలత సీడీపీఓ(ఫాక్), రమేష్ (సీప్స్ –డీసీపీయు), అర్చన (ఏఈఓ), డా. జావేరియా, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


