Home POLITICS టెలికాం మౌలిక సదుపాయాల నిధి లేదన్న కేంద్రం

టెలికాం మౌలిక సదుపాయాల నిధి లేదన్న కేంద్రం

21
0
  • దూరప్రాంతాల అభివృద్ధిపై లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
  • డిజిటల్ భారత్ నిధితోనే సేవల విస్తరణకు ప్రాధాన్యమని వివరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

న్యూ ఢిల్లీ ఆర్గాన్ న్యూస్ :

దేశంలో టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (TIDF) అమలులో ఉందన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రత్యేక నిధి ప్రస్తుతం లేదని వెల్లడించింది. లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు.
TIDF లేదు… DBN ద్వారానే సేవలు
టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధికి TIDF అనే ప్రత్యేక నిధి లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే, టెలికమ్యూనికేషన్ చట్టం-2023 ప్రకారం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి (Digital Bharat Nidhi – DBN) ద్వారా దేశవ్యాప్తంగా టెలికాం సేవలను అందించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
దూరప్రాంతాలపై దృష్టి
గ్రామీణ, దూరప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో టెలికాం సేవలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. సేవలు అందని ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.