- కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నివారణ
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 19:
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని భూటారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరు నాగారం మండలం భూటారం గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 500 మీటర్ల పొడవు తో 195.00 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న జంపన్న వాగు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని భూటారం గ్రామానికి సమీప జంపన్న వాగు నుంచి తరచూ వరద ముంపు ఉండేదని గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 1 కోటి 95 లక్షల రూపాయల నిధులతో 500 మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు.
కరకట్ట నిర్మాణంతో గ్రామానికి వరద ముంపు నుంచి విముక్తి కలుగుతుందని నాణ్యత ప్రమాణాలను అత్యంత పటిష్టంగా కరకట్ట నిర్మాణం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామ ప్రజలు యువకులు సలహాలు సూచనలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.మంగపేట మండలంలో 100 కోట్ల రూపాయల నిధులతో నూతన టెక్నాలజీ ఉపయోగించి కరకట్ట నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్య లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను అవలంబిస్తుందని స్థానికంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే యువకులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూటారం ప్రజల వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం అనేక విధాలుగా ఆలోచించడం జరిగిందని ప్రజలకు మేలు జరిగే విధంగా గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సి వస్తుందా లేక ప్రత్యామ్నాయంగా ఇతర ఆలోచనలు చేసినపుడు గ్రామ సమీప జంపన్న వాగు వరద ఉధృతికి తగ్గట్టుగా కరకట్ట నిర్మాణం చేయాలని దానికోసం గ్రామస్తుల సలహాలు సూచనలు మేరకు 500మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఇంజినీరింగ్ శాఖ ఎస్సీ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు


