Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ సన్ స్ట్రోక్ ను సాగనంపుదామా ?

సన్ స్ట్రోక్ ను సాగనంపుదామా ?

12
0

అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి:

వేసవి ఠారెత్తిస్తుంది.. మే మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి.. హీట్ వేవ్ వార్నింగులు జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు కోకోల్ల లుగా వస్తున్నాయి.. ఇప్పుడే ఇలా ఉంటే మే చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చర్చోప చర్చలు కూడా సాగిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ వడగాలులు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక లుక్కేద్దాం.

వడగాలులు అంటే?

సింపుల్ గాచెప్పాలంటే వేడి గాలులు వాతావరణం ఎగువన (9,800-24,900 అడుగులు) ఉన్న అధిక పీడన ప్రాంతం బలపడి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఒక ప్రాంతం పై నిలిచి ఉన్నప్పుడు వడగాలులు ఏర్పడతాయి. 1950 నుంచి భూమిపై దాదాపు ప్రతి ప్రాంతంలోనూ వేడిగాలులు అంతకంతకు పెరుగుతున్నాయి. వాతావరణం వల్ల 2024 నుంచి ఇవి మరింత తీవ్రతరం అయ్యాయి. అనేక ప్రాంతాలలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు చవిచూస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మానవ శరీరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది. మన శరీరం 37 డిగ్రీల వద్ద చక్కగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రతలు 37° సెల్సియస్ దాటిన తర్వాత శ్వాస వేగవంతం అవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 40 డిగ్రీల సెల్సియస్ స్ వద్ద శరీరం చల్లగా ఉండడానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల శక్తి వినియోగం 35% పెరుగుతుంది. శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొద్దిసేపు స్థిరంగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు వేడికి గురి కావడం ప్రమాదకరం. 42 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన హానిని కలిగిస్తాయి. అందువల్ల మన శరీర ఉష్ణోగ్రతను 37° వద్ద స్థిరంగా ఉంచడానికి మన మెదడులో ఉండే హైపోదోలవస్ అనే భాగం పని చేస్తూ ఉంటుంది. అయితే బయట వేడి వాతావరణం ఉంటే మన శరీరం ఆ వేడిని నిరంతరాయంగా గ్రహిస్తూ ఉండడం వలన చల్లబరచడం కష్టమవుతుంది. మన శరీరంపై ఏర్పడిన చెమట ఆవిరి అయ్యే పరిస్థితి పై ఇది ఆధారపడి ఉంటుంది. పొడి వాతావరణం చెమట త్వరగా ఆవిరై మన శరీరంలోని అధిక వేడిని వెంటనే తొలగిస్తుంది అదే తేమతో కూడిన రోజులలో తేమ గాలితో నిండి ఉండటం వల్ల చమట ఆవిరి కావడం నెమ్మదిస్తుంది. దీనితో శరీరం వేగంగా వేడెక్కడానికి వడదెబ్బకు గురి కావడం కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో శరీరం తన అంతర్గత వేడిని నియంత్రించుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అప్పుడు గుండె మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతాయి. అధిక వేడి శరీరం పైననే కాకుండా నాడీ సంబంధిత ముప్పుగాను పరిణమిస్తుంది. మెదడుపై ఇది చూపించే ప్రభావం మైగ్రేన్లు మూర్చల నుంచి మానసిక రుగ్మతలు పక్షవాతం రావడం వరకు కారణం అవుతుంది. మనం ఆలోచిస్తున్నప్పుడు దేనికైనా ప్రతిస్పందించినప్పుడు మెదడు కొంచెం వేడిని విడుదల చేస్తుంది. అప్పుడు శరీరం దానిని చల్లబరుస్తూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఈ ప్రక్రియ ఫెయిల్ అయితే మొత్తం శరీర వ్యవస్థ అదుపుతప్పుతుంది. వేడి వాతావరణం మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో అధిక వేడి సమయంలో వడదెబ్బలు కండరాల నొప్పుల నుంచి తీవ్రమైన డీహైడ్రేషన్ వడదెబ్బ సంభవించవచ్చు. వడదెబ్బ వల్ల అధిక చెమట నీరసం వికారం కండరాల నొప్పులు కలగవచ్చు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి తీవ్రమైన వడదెబ్బగా మారితే అది గందరగోళం మూర్ఛలు అవయవ వైఫల్యాలకు దారి తీయవచ్చు.. చెమట పట్టడం వలన నిర్ణీలీకరణం ( డీహైడ్రేషన్ ) అవసరమైన లవణాలు నష్టం కూడా జరగవచ్చు దీనివలన తల తిరగడం స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అత్యధిక వేడి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీర ప్రధాన ప్రాధాన్యం చల్లగా ఉండడమే ఇందుకోసం చెమట ద్వారా వేడిని విడుదల చేయడానికి శరీరం చర్మానికి ఎక్కువ రక్తం పంపుతుంది. ఈ మార్పు వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గి జీర్ణక్రియ నిమ్మదిస్తుంది. ఫలితంగా కడుపులో భారంగా అనిపించడం ఆకలి తగ్గడం యాసిడ్ రిఫ్లెక్స్ లేదా సాదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. శరీరంలో తగినంత ద్రవాలు లేనప్పుడు జీర్ణక్రియ మరింత మందగిస్తుంది. దీనివలన మలబద్ధకం కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా వృద్ధులలో వేడి వాతావరణం లో తగినంత నీరు త్రాగని వారిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

ముప్పుతప్పాలి అంటే ఏమి చేయాలి?

సాధ్యమైనంత వరకు ఇంటి లోపలే ఉండాలి, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల మధ్య బయటకు వెళ్ళవద్దు. దాహం వెయ్యకుండా ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో కష్టమైన పనులు చేయరాదు. ఓ ఆర్ ఎస్ లస్సి నిమ్మకాయ నీళ్లు మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ప్రోటీన్ నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోరాదు. పిల్లలను జంతువులను పార్కు చేసిన వాహనాలలో వదిలిపెట్టకూడదు. టీ కాఫీ వంటివి తాగకూడదు. వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాలి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడిగుడ్డతో తుడవాలి లేదా మామూలు నీళ్లను తలపై చల్లాలి ఓఆర్ఎస్ నిమ్మకాయ నీళ్లు లేదా గంజి వంటి రీ హైడైట్ పానీయాలు అందించాలి వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి.