Home agriculture ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

40
0
  • డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల
  • సోములగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 20​:

ఆరుగాలం కష్టించి ధాన్యం పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అధికారులను కోరారు. పాల్వంచ మండలం పరిధిలోని సోములగూడెం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ పాలకవర్గం సభ్యులు బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని, తూర్పార పట్టే విధానాన్ని, రైతులు తూకం వేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని అన్నారు. త్వరలో రాష్ట్రంలో వర్షాలు పడే ప్రమాదం ఉందని, అధికారులు మిల్లర్లతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ధాన్యాన్ని మిల్లుల్లో దించుకునేలా చర్యలు తీసుకోవాలని కొత్వాల అన్నారు.

​ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ , డైరెక్టర్ భూక్యా కిషన్, సొసైటీ సి.ఇ.ఓ. ఏ. లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.