Home Uncategorized దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో మంత్రి అడ్లూరి

దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో మంత్రి అడ్లూరి

25
0
  • దివ్యంగుల ఉన్నత చదువులకు 50 కోట్లు కేటాయింపు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 3:

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఉన్న దివ్యాంగుల–బదిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళా, శిశు, దివ్యాంగుల‌, వయోవృద్ధుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులతో స్వయంగా మాటలాడిన మంత్రి, వారి కళా ప్రదర్శనలను వీక్షించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దివ్యాంగుల దినోత్సవాన్ని కరీంనగర్‌లోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగుల శాఖకు రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు దివ్యాంగుల విద్య పదో తరగతివరకే పరిమితమై ఉండేది. ఇకపై ఇంటర్‌, డిగ్రీ వరకు చదివే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
గత ప్రభుత్వంలో దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం నెలకొన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అన్ని రంగాల్లో చర్యలు చేపడుతోందని చెప్పారు. దివ్యాంగులకు స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు త్వరలోనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.