Home agriculture చెమట రైతు ది – లాభం దళారీది

చెమట రైతు ది – లాభం దళారీది

20
0
  • భారతీయ కిసాన్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7: నేలను నమ్ముకుని చెమట చిందించి దేశానికి అన్నం పెట్టే రైతు నేడు అగమ్య గోచర స్థితిలో ఉన్నాడని భారతీయ కిసాన్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆకాశం కేసి చూసి వర్షం కోసం నేలకువైపు చూసి పంట కోసం ఎదురుచూసే రైతు తీరా పంట చేతికి వచ్చాక దళారుల కబంధహస్తాలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మద్దతు ధర మ్రృగ్యమై ప్రభుత్వం ప్రకటించే కనీసం మద్దతు ధర( ఎంఎస్పి) రైతు దరి చేరడం లేదని నాణ్యత సాకుతో తాలు ఉంది అని దళారులు భారీగా తగ్గించి రైతులను నిలువునా ముంచుతున్నారని అన్నారు. వీటికి తోడు కొనుగోలు కేంద్రాల కొరత వేధిస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెర్చుకోకపోవడం తెరుచుకున్నా రకరకాల నిబంధనలతో కొనకపోవడం రైతులను ఇబ్బంది పెట్టడం వలన రైతు గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. పెట్టుబడి భారమై విత్తనాలు ఎరువులు డీజిల్ ధరలు పెరిగి పెట్టుబడి రెట్టింపు అయ్యిందని అప్పులు తీర్చాలనే తొందరలో దళార్లు అడిగిన తక్కువ ధరకే ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన రైతులకు రూపాయి మిగలడం లేదు, కానీ గంటల వ్యవధిలో పంటను మార్పిడి చేసే దళారీలు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారని రైతు కష్టం దళారుల లాభం, ఇది ఏ తీరు న్యాయం, మద్దతు ధర లేక దళారీ దయ పై రైతు బలి అవుతున్నాడని అన్నారు.