Home ఖమ్మం ఖమ్మం జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం

ఖమ్మం జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం

20
0
  • బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్స్ అవార్డు- 2026 అందుకున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • హైదరాబాద్ బీట్స్ పిలాని గ్లోబల్ సమ్మిట్ లో అలుమ్ని అచీవర్స్ అవార్డును జిల్లా కలెక్టర్ కు ప్రధానం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, జనవరి10:

ప్రపంచ స్థాయి విద్యా సంస్థ బిట్స్ పిలాని (బిట్స్ పిలాని) అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యంగ్ అలమ్నస్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ (YAAA)- 2026 ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు. శనివారం హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ పిలాన్ ఇన్స్టిట్యూట్ నందు జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో యంగ్ అలమ్నస్ అచీవ్‌మెంట్ అవార్డ్ 2026 (YAAA) ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర సమాచార, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా అందుకున్నారు. యువ వయసులోనే పరిపాలనా రంగంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రజాసేవలో నూతన ఆలోచనలతో కూడిన పాలన అందిస్తున్నందుకు గాను ఈ అరుదైన గౌరవానికి ఆయనను ఎంపిక చేసినట్లు బిట్స్ పిలాని అలుమ్ని రిలేషన్స్ కమిటి అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బిట్స్ పిలాని ప్రతి సంవత్సరం అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా కొద్ది మంది అలుమ్నీలకే ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక తక్కువ కాలంలోనే తమ రంగాల్లో విశేష విజయాలు సాధించి, సంస్థకు గర్వకారణంగా నిలిచిన అలుమ్నీలను గుర్తించి ఈ అవార్డును బిట్స్ పిలాని వారు అందిస్తున్నారు.