Home ఎడ్యుకేషన్ అడవిలో నిప్పు నివారణపై అవగాహన సదస్సు

అడవిలో నిప్పు నివారణపై అవగాహన సదస్సు

22
0
  • అక్రమ కలప రవాణా చేస్తే కఠిన చర్యలు ఫారెస్ట్ ఆఫీసర్

తిరుమలాయపాలెం, ఆర్గాన్ న్యూస్, మార్చి 28 :

మండలంలో అడవి మంటల నివారణపై ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి రేంజ్ ఆఫీసర్ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో అడవుల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, ముఖ్యంగా పొగ త్రాగిన తర్వాత సిగరెట్ ముక్కలు, మాచిసులు నిర్లక్ష్యంగా పడేయరాదని హెచ్చరించారు.
మండల పరిధిలోని చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కాలు కింద పోతున్న అటవీ భూములను ప్రభుత్వం తిరుమలాయపాలెం పులి గుట్ట ప్రాంతంలో భూమిని కేటాయించిందని ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ అటవీ సంపాదన కాపాడుకోవాలని వృక్షాలను కాపాడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి జీవకోటికి ప్రాణవాయువు అందించేది వృక్షాలేని వాతావరణ సమతుల్యత తో వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఏసవికాలంలో రైతులు దుక్కులు సిద్ధం చేసుకునే సమయంలో వ్యవసాయ వ్యర్ధాలకు నిప్పు పెట్టడం ద్వారా వృక్షాలకు అంటుకొని పెద్ద ఎత్తున అటవీ సంపద కాలుతుందని అలాంటి పనులు రైతులు చేయొద్దని సూచించారు. జాతీయ రహదారి వెంబడి పెంచుతున్న వృక్షాలను సైతం నిప్పు అంటిస్తున్నారని అలాంటి వారిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. మండల లో ఎక్కడైనా అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడవిలో మంటలు కనిపించిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, గ్రామస్థులు కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి సహకరించాలని కోరారు. అలాగే రైతులు పొలాల వద్ద చెత్త దహనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అడవి మంటలు ఆర్పండి – ప్రకృతిని కాపాడండి అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం లో ఎంపీఈఓ ప్రభాకర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి చల్లా భవ్య గ్రామ సర్పంచ్ ధరావత్ సుజాత ఉపసర్పంచ్ బుర్ర వాసు వార్డు సభ్యులు కొలిచలం కవిత కొమ్ము శ్రీను ఉండేటి ధర్మరాజు వార నాగరాజు నేలమరి రాజు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో ఎంపీఈవో ప్రభాకర్ రెడ్డి ఇన్ చార్జి పంచాయతీ కార్యదర్శి చల్లా భవ్య మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ గ్రామ సర్పంచ్ ధరావత్ సుజాత ఉపసర్పంచ్ బుర్ర వాసు వార్డు సభ్యులు కొలిచలం కవిత కొమ్ము శ్రీను ఉండేటి ధర్మరాజు వార నాగరాజు నేలమర్రి రాజు కొలిచలం స్వామి ఏగూరి దాసు కొలిచలం శ్రీనివాస్ గ్రామ పెద్దలు ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.