Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్న వాడు మిగులుతాడా ?

కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్న వాడు మిగులుతాడా ?

4
0
  • హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 11: మనిషి మొదటి దేవాలయం కుటుంబం అని కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? అని ప్రశ్నించారు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాస్. గురువారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కుటుంబంలో మొదటి గురువు తల్లి మొదటి భరోసా తండ్రి మొదటి భరోసా అన్నా లేదా తమ్ముడు మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు కానీ నేడు అదే కుటుంబం కూలిపోతుంటే మనిషి బతికి ఉన్న జీవితం సరిపోతుంది అన్నారు. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడో మొదలైందో తెలియదు కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోతున్నాయని మాటలు తగ్గిపోయాయని మనుషులు దూరమయ్యారని అన్నారు. ఒకనాడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురుచూసేవారు ఇప్పుడు అదే తల్లి కొడుకుతో రెండు నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోందని అన్నారు. ఏం మాట్లాడితే ఏం కోప్పడతాడు అని తల్లి గుండె వణుకుతోందని అన్నారు. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తుకొని కౌగిలించుకునే వారిని ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలు ఫోన్లలో బతుకుతున్నారని అన్నారు. ఇప్పుడు ఆ తండ్రి కళ్ళలో ఒకటే ప్రశ్న నేను డబ్బు సంపాదించి ప్రేమను కోల్పోయినా? అని నేను వీళ్లకు ఒక ఏటీఎం మెషినా అని ప్రశ్నించుకుంటున్నాడు. అన్నదమ్ములు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకున్న రోజులు పోయాయని ఇప్పుడు గజం భూమి కోసం తన్నుక చస్తున్నారని అక్కాచెల్లెళ్లు ఒకరి బాధలు ఒకరికి కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయం అయిపోయాయని ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోన్ చేయడానికి సమయం లేదని భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం రాజ్యమేలుతుంది అన్నారు. క్షమించు అనే ఒక మాట చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు స్మశానాలుగా మారిపోతున్నాయని ఎంత దారుణం అంటే కన్నతల్లి కూడా బిడ్డల పై కక్ష పెంచుకుంటుందని కన్న కొడుకు తండ్రి పై చేయి చేసుకునే దుస్థితి చేకూరిందని ఈ దృశ్యాలు చూస్తుంటే మనిషి ఎదిగాడా లేక మానవత్వం చనిపోయిందా అనిపిస్తుంది అన్నారు. ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆప్యాయత లేదు అని డైనింగ్ టేబుల్ ఉంది కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరని ఉన్నవారికి ఆ మనసు లేదని వేల రూపాయల ఫోన్లు ఉన్నాయని అమ్మ ఎలా ఉన్నావు అనే అడిగే వారు కరువు అయ్యారని అన్నారు. ఈరోజు మనం మన పిల్లలకు అన్ని నేర్పిస్తున్నాం కానీ కుటుంబ విలువలు మాత్రమే నేర్పించడం లేదని అది మరచిపోయాము అని ర్యాంకులు తెప్పిస్తున్నాం కానీ రక్తసంబంధం నిలబెట్టుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నామని కానీ మనుషుల మనుషులని ఎలా గెలుచుకోవాలో నేర్పడం లేదని ఇప్పుడు పెద్ద ఇండ్లు ఉన్నాయి కానీ అందులో మనుషులు ఉండడం లేదని ఖరీదైన మంచాలు ఉంటున్నాయి కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదని, పుట్టినరోజు నాడు వందల మెసేజ్లు వస్తాయి కానీ కళ్ళలోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు ఉండడం లేదని, ఆరోజు మనిషి ఏడుస్తాడు కానీ ఆ కన్నీళ్లు తుడిచే చెయ్యి ఉండడం లేదని కుటుంబం అంటే కేవలం రక్తసంబంధం కాదు మనసు పలికించే పవిత్ర స్థలం అది కూలిపోతే దేశమే కాదు ప్రపంచమే కూలిపోతుందని, అందుకే ఈరోజు నుంచైనా తల్లిదండ్రులతో ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడదాం అన్నదమ్ములను గౌరవిద్దాం అక్క చెల్లెలను ఆప్యాయంగా పలకరిద్దాం భార్యాభర్తలు గెలవడానికి కాదు కలిసి జీవించడానికి ప్రయత్నిద్దాం అని ప్రారంభం చేయండి అన్నారు ఎందుకంటే చనిపోయాక శివ పేటిక మోసేందుకు చాలామంది దొరుకుతారు కానీ బతికి ఉన్నప్పుడు మనసును మోసేది కుటుంబ సభ్యులు అని కుటుంబాన్ని కాపాడుకుందాం అని మనుషులను బతికిద్దామని లేకపోతే రేపటి తరానికి ఇండ్లు మిగులుతాయి కానీ ఇంటి వాళ్ళు మిగలరని అన్నారు. కుటుంబం అనే పూలదండ లాంటిదని ఏ పువ్వుకు ఆ పువ్వు దండ నుంచి విడదీసి ఆ దండకు ఉన్న విలువను గౌరవాన్ని తీయకండి అని దానికున్న అందాన్ని చెడగొట్టకండి అని కోరారు కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ అనురాగాలు పోతే ఆ కుటుంబానికి విలువ ఉండదని దయచేసి చిన్న ఇగోలకి గొడవలకి పోయి బంధాలను తెలుసుకోవద్దని ఏకాకిగా మిగిలిపోవద్దని బంధాలను కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించాలని కోరారు.