Home POLITICS మళ్లీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం ఖాయం

మళ్లీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం ఖాయం

17
0
  • భారత రాష్ట్ర సమితి బడంగ్ పేట, మాజీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మే 22: రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భారత రాష్ట్ర సమితి బడంగ్ పేట, మాజీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే భారత రాష్ట్ర సమితి వైపు ప్రజలు చూస్తున్నారని పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 100% తిరిగి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి మరింత బాధ్యతగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే రామిడి రామిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. వారం రోజుల్లోనే పెట్రోల్ లీటర్ నాలుగు రూపాయల వరకు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకంలో భాగమని నిత్యవసరాల రేట్లు పెరగడంతో సామాన్య సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడని, మళ్లీ సారు రావాలి కారు కావాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పై కార్యకర్తల దృష్టి పెట్టాలని డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వం నమోదు చేయాలని ఆకాంక్షించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన “సర్” ప్రక్రియ తో పాటు ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతుందని ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలో జరగాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వం నమోదు సమన్వయకర్తలను నియమించుకోవాలని కోరారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా సబితా రంగారెడ్డి వికారాబాద్ భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదుకు రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి నిన్ను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పనిలో నిబద్ధత పట్టుదల పనిచేసే తత్వం ఉన్న సబితా ఇంద్రారెడ్డిని నియమించడం అభినందనీయమని ఆయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన కృతజ్ఞతలు తెలిపారు.