గ్యాస్ ఒక జ్ఞాపకం కానుందా? (అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి) ఇంట్లో బోర్ కొడితే బయట తినొచ్చు అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరకడం లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితి తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటికి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు కానీ గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.. వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట 1980లో చిన్న పల్లెటూర్లలో ఇదో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు పెద్ద రిలీఫ్ ఏమిటి అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది వానొచ్చిన చలి ఉన్న అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైన ఎప్పుడైనా సరే టాప్ మనీ వెలుగుతుంది. గతంలో ఆడవాళ్లు ఈ వింతను చూసేదానికి గ్యాస్ కొన్న వారి ఇంటికి వెళ్లేవారు అప్పటివరకు వాళ్లకు కట్టెల పొయ్యే తెలుసు కట్టెలు తెలుసుకొని పోయిలో పెట్టుకుని వాటిపై కిరోసిన్ పోసి మండించి బాగా మండే వరకు ఆగి ఆ తర్వాత ఊదులు గొట్టంతో ఊది ఊది ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు. ఇక కిరోసిన్ స్టాప్ ఉంటుంది కానీ అందుకు కిరోసిన్ కావద్దా ఒత్తులు ఉండే స్టొత్తులు సరిచేసుకొని వెలిగించి మెల్లగా వంట మొదలు పెడితే ఎప్పటికో అవుతుంది పంపు శ్రవణ్ కొంచెం డేంజర్ ఇది మగవారికి సౌకర్యమే కానీ ఆడవాళ్లకు బెరికే బుజుమని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్ ఆ రోజులలో ఫెయిల్ ఏవి ఈ స్టవ్లో వాడాలంటే తరచూ పింతో నొక్కి బర్నర్ ని యాక్టివేట్ చేయాల్సి మన పరిస్థితి అది ఒక తలనొప్పి. అయినా సరే పెద్ద టెన్షన్ ఉండేది కాదు కట్టెలు దొరుకుతాయి కిరోసిన్ కూడా బ్లాక్లో బాగా దొరికేది వంట చేయాలి అనుకోవాలి కానీ చేయవచ్చు ఆ సమయంలో ఇలా గ్యాస్ ఊడి పడింది. ఎన్నో అనుమానాలు మొదట గ్యాస్ స్టవ్లు ఎవరు నమ్మలేదు సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేని గ్యాస్ మంట మీద ఉండేవి రుచిగా ఉండదని మరొక అభిప్రాయం గ్యాస్ స్టవ్లు ఎలా తుడవాలి ఎలా శుభ్రం చేయాలి తెలియదు ఇక రెగ్యులేటర్ ది పెద్ద అవస్థ అది బియ్యం తడం తీయడం తెలియదు రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా భయం ఉండేది ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగోలు ఉండేది గ్యాస్ వాసన వస్తే భయపడి పోయేవారు ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కోసమని ప్రచారం చేసేవారు ఆ ఎర్ర రంగు సిలిండర్ ఇంట్లోకి అడుగు పెట్టింది. సిలిండర్ వచ్చింది సింగిల్ సిలిండర్ చాలా ఏళ్లు డబల్ సిలిండర్ కొద్ది మంది దగ్గర ఉండేవి సిలిండర్ పనిచేస్తూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది అంతవరకు రకరకాల పద్ధతుల్లో వంటసాగేది గ్యాస్ దొరకడం లేదట అనే వార్త అప్పటినుంచి ఇప్పటివరకు స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది . అదెప్పుడు తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు ఉదయాన్నే అందరూ పాఠశాలలకు కార్యాలయాలకు బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టు ఉండగా అయిపోతుంది ఆ క్షణం ఇంట్లో రేగే కలవరం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు. కాస్త సిలిండర్ ఇస్తారా సిలిండర్ చేతులలోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగుపొరుగు మధ్య గ్యాస్ సంబంధం ఏర్పడింది వీరు సిలిండర్ ఇచ్చేవారు సిలిండర్ ఇవ్వని వారిగా విభజితులు అయ్యారు మనకు సిలిండర్ ఇచ్చే వారే క్లోజ్ ఫ్రెండ్స్ గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది గతంలో పోస్ట్మాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది ఇప్పుడు గ్యాస్ బండి వీధిలోకి వస్తే ఆనందం కలుగుతుంది.