ఖమ్మం, మార్చి 21:
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.
నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు నిర్వహించిన ముస్లిం సోదర సోదరీమణులు ఈ పండుగను ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. త్యాగం, సహనం, భక్తి విశ్వాసాలకు రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే మనుషుల మధ్య సామరస్యం, ఐకమత్యం, సోదరభావం పెంపొందించే పండుగగా రంజాన్ ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి తన శుభాకాంక్షల సందేశంలో తెలిపారు.


